కాకతీయ, మంథని: రాజకీయ పార్టీలను, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే హక్కు ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో మంథని నియోజకవర్గంలో పోలీసులు మారక పోతే మంథని నుంచే ప్రళయం మొదలు అవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హెచ్చరించారు.
ఆయన మాట్లాడుతూ పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, దుద్దిళ్ల కుటుంబానికి ఎప్పుడు పదవులు వస్తే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలను చూపించడం పరిపాటిగామారింది. దుద్దిళ్ల కుటుంబానికి వత్తాసు పలికే పోలీసులను ఇప్పటికే అనేకమార్లు అప్రమత్తం చేశామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21నెలలు గడుస్తున్నా 420హమీలకు మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఉన్న మంథని ఎమ్మెల్యే యూత్,మహిళా రైతు డిక్లరేషన్‌ల గురించి ఆలోచన చేయడం లేదన్నారు.
వృద్దులు వికలాంగుల పించన్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గాన్ని సింహబాగం మంథని ఎమ్మెల్యే ఆయన తండ్రి పాలించారని, ప్రస్తుతం 21నెలలు గడిచినా ఈప్రాంతంలో 21కార్యక్రమాలు చేయలేదని, 21మందికి ఉద్యోగాలు ఇప్పించలేదని విమర్శించారు. ఎవరిమీదనైతే ఆరోపణలు చేస్తరో ఆ వ్యక్తి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పిందన్నారు.
హైకోర్డు తీర్పు వెలువరించిన క్రమంలో మంథని పోలీసుల్లో మార్పు రావాలన్నారు. భారత రాజ్యాంగం మాత్రమే మీకు ఉద్యోగాలు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో రేవంత్‌రెడ్డో, దుద్దిళ్ల శ్రీధర్‌బాబో, మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని విషయాన్ని గుర్తించాలన్నారు. పోలీసులు జైలుకు పోతే దుద్దిళ్ల శ్రీధర్‌బాబో ఆయన సోదరుడు జోకర్ శ్రీనో వచ్చి కాపాడరని ఆయన స్పష్టం చేశారు.
ఈనాడు యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారని, యూరియా బస్తాలను కాంగ్రెస్ నాయకులకు ఇచ్చి రైతులను గోసపెడుతున్న దుద్దిళ్లపై కేసు పెట్టాలన్నారు.ఆనాడు ఆడవాళ్ల మీటింగ్‌లకు పోయి బెల్ట్‌షాపులు బంద్ చేయిస్తం, 500బోనస్ ఇస్తమని, అవసరమైతే సోనియమ్మదగ్గరకు పోతామని గొప్పలు చెప్పుకున్నారని, వాటిని అమలు చేయడంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.


