epaper
Wednesday, January 28, 2026
epaper

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం
జయశంకర్ జిల్లాపై దుష్ప్రచారం మానుకోండి!
అబద్ధాల పుట్టు పూర్వోత్తరాలు కేసీఆర్ ఇంట్లోనే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాక‌తీయ‌, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్టు నేతలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందంటూ కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. “ఒకవేళ జిల్లా నిజంగానే మారితే, నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ రకమైన అబద్ధపు ప్రచారాలు ప్రజల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలేనని అన్నారు.

రూ.350 కోట్ల అభివృద్ధి కనిపించడంలేదా?

గత రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, లైటింగ్ వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, పట్టణం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంటే కొందరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిపై ఎవరికైనా సందేహాలుంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. “అబద్ధాలు ఎక్కడ పుట్టాయంటే… కేసీఆర్ ఇంట్లోనే పుట్టాయి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై జరుగుతున్న అసత్యపు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, దానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, 30 వార్డుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతోనే దుష్ప్రచారాలకు సరైన సమాధానం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు

గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు ఆదివాసీ విశ్వాసానికి ప్రతీకగా ఎదురుకోళ్ల సంప్రదాయం కాక‌తీయ‌,...

మేడారంలో ఉద్విగ్నం

మేడారంలో ఉద్విగ్నం తల్లి రాక కోసం జంపన్నవాగు వద్ద లక్షల మంది ఎదురుచూపులు పూన‌కాల‌తో...

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి…

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి... డాక్టర్ బి.రవీంద్ర నాయక్...

మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర!

మేడారంలో మారుతున్న ప్రసాద పరంపర! బెల్లం స్థానంలో లడ్డు.. భక్తుల్లో సందేహాలు ఇప్పపువ్వు పేరుతో...

మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం

మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం రోజురోజుకూ పెరుగుతున్న గల్లంతులు.. ఆందోళనలో కుటుంబాలు ప్రకటనలకే పరిమితమైన...

సెల్..హెల్‌..

సెల్..హెల్‌.. మేడారంలో మొబైల్ నెట్‌వర్క్‌లు ఫెయిల్! భక్తులు–మీడియా ప్ర‌తినిధుల‌కు తీవ్ర ఇబ్బందులు జియో పూర్తిగా డౌన్..ఎయిర్‌టెల్,...

భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాల

భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాల రాష్ట్ర వైద్యా,ఆరోగ్య శాఖ డైరెక్టర్  డాక్టర్ బి.రవీంద్ర నాయక్ కాకతీయ,ఆత్మకూరు...

ఎంపీడీవోను అభినందించిన కాస్య తండా సర్పంచ్

ఎంపీడీవోను అభినందించిన కాస్య తండా సర్పంచ్ కాకతీయ, నెల్లికుదురు: నెల్లికుదురు మండల ఎంపీడీవో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img