అలా అయితేనే ఓకే ..
కాకతీయ, సినిమా డెస్క్ : వరుస సినిమాలతోనే కాదు… వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటున్నారు నటి రష్మిక మందన్నా. తాజాగా ఆమె ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు. తన సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన గురించి వచ్చే రూమర్స్ లో ఒకదానిపై రష్మిక స్పష్టతనిచ్చారు. ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే నటిని నేనే అని అందరు అనుకుంటారు. అది అపోహ మాత్రమే. నేనేం హీరోని కాదు ఎక్కువ తీసుకోవడానికి. అది నిజమైతే బాగుండు అని నేను ఎదురు చూస్తున్నా. ప్రత్యేక గీతాల్లోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ అయి ఉండాలి. లేదంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వాళ్ళు అడిగితే కచ్చితంగా లీడ్ రోల్ కాకపోయినా వాళ్ల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తా.. అని చెప్పారు. కానీ ఆ దర్శకులు ఎవరో మాత్రం రష్మిక చెప్పలేదు. దీంతో ఎవరా ముగ్గురు దర్శకులు అంటూ రష్మిక అభిమానులు చర్చించుకుంటున్నారు.


