epaper
Monday, March 2, 2026
epaper

బీజేపీకి అవకాశం ఇస్తే రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తా

బీజేపీకి అవకాశం ఇస్తే రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తా

హుజూరాబాద్ రూపురేఖలు మార్చడం నా బాధ్యత

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కాకతీయ, హుజూరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల కేంద్ర నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.259 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను చొరవ తీసుకున్న కారణంగానే ఈ నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు.రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప మరేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వడం తమకు చేతకాదని, మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు.హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి వెళ్లి వరదలా నిధులు తీసుకొచ్చి పట్టణం రూపురేఖలు మార్చుతానని హామీ ఇచ్చారు. ఎన్నికలైన వెంటనే హుజూరాబాద్‌లో మినీ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభిస్తానని తెలిపారు. గతంలో కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు.


మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హుజూరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.19.57 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.1.10 కోట్లు, అమృత్ ద్వారా రూ.16.25 కోట్లు, స్వనిధి ద్వారా 4,377 మందికి రూ.7.63 కోట్లు, యూఐడీఎఫ్ ద్వారా రూ.36 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. వీధిదీపాలు, రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికల నిర్మాణం అన్నీ కేంద్ర నిధులతోనే జరిగాయని తెలిపారు.
సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్‌మెంట్స్, కమ్యూనిటీ హాల్స్, బోర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చామని, టెన్త్ పరీక్ష ఫీజును తన జీతం నుంచే చెల్లించానని పేర్కొన్నారు.
బీజేపీకి మున్సిపల్ పీఠం అప్పగించిన వెంటనే అర్థాంతరంగా నిలిచిన మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయిస్తామని, నిరుపేదలకు ఇళ్ల మంజూరు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, మురుగు కాలువలు, సీసీ రోడ్లు, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 100 పడకల ప్రభుత్వ దవాఖానాలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని తెలిపారు.
ఈ సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్ ఎర్రం మహేశ్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img