- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఆడపిల్లలను వేధించే వారెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమస్యపై సమాచారం అందగానే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి నిమిషాల్లోనే నిందిత అటెండర్, నిర్లక్ష్యం వహించిన హెడ్‌మాస్టర్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకునేలా చేమని తెలిపారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే, తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, తహసీల్దార్ అంబటి రజిత, ఎండివో రామ్, ఎంఈఓ ప్రభాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, పడాల రాజన్న, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, రాచమల్ల భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, కర్ర బాపురెడ్డి, నగేష్, మహేష్, ఆనంద్, ముచ్చ శంకరయ్య, మంత్రి మహేందర్, గంగాధర ప్రవీణ్, మ్యాక్ వినోద్, వంగల శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.


