రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు
సీఎం విజిట్ పేరుతో హడావిడిగా మొక్కజోన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు
15 రోజులైనా ఒక్క కిలో కూడా కొనలేదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం
కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నర్మెట గ్రామంలో సీఎం విజిట్ ఉందని చెప్పి హడావిడిగా మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్రం ప్రారంభించి 15 రోజులు దాటినా ఇప్పటివరకు ఒక్క కిలో కూడా మొక్కజొన్న కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బడ్జెట్ సమావేశాల్లోనే మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు వస్తాయని ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు.మొక్కజొన్న విక్రయ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ తరఫున ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.సమస్యపై మాట్లాడేందుకు అవకాశం అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. జీరో అవర్, బడ్జెట్ చర్చల్లో మాట్లాడితే సీఎం వస్తున్నారు.. కేంద్రం ప్రారంభమైందని ప్రభుత్వం సమాధానం చెప్పిందని,నేను ఉన్నా లేకున్నా పరవాలేదు..రైతులకు నష్టం జరగకూడదని స్పష్టం చేసారు. అకాల వర్షాలు పడుతున్నా. పగటి పూట కోతుల భాధ, రాత్రి పూట అడవి పందుల భాధతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.రైతులు ఈ సమస్యలన్నింటిని తట్టుకొని పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఈ పరిస్థితి వివరించడంతోనే హడావిడిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కొనుగోళ్లు జరగలేదని మండిపడ్డారు.
కొనుగోలు మొదలు పెట్టకపోతే రైతులు కేంద్రాలకు రావడం లేదన్నారు.రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం చాలా కష్టంగా మారుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2400 మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.13, 14 శాతం తేమ నిబంధనల ప్రకారం మొక్కజొన్న కొనాలని అధికారులకు సూచించారు.వెంటనే భరదన్ విడుదల చేసి కొనుగోలు ప్రారంభించాలని అన్నారు. ఈసారి నీటి సమస్య కారణంగా రైతులు వరి బదులు మొక్కజొన్న పంట వేశారని, తపస్ పల్లి రిజర్వేయర్ నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో మొక్కజొన్న సాగు పెరిగిందని తెలిపారు.ప్రస్తుతం మొక్కజొన్న కోతకు వచ్చిందని,ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని పైర్ అయ్యారు.చేర్యాల పాత డివిజన్ పరిధిలో నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట ప్రాంతాల నుంచి ప్రైవేట్ మార్కెట్ వ్యాపారులు వచ్చి దోపిడీ చేసే పరిస్థితి ఉంటుందన్నారు. లోకల్ రైతులను ఇష్టం వచ్చినట్లు ఇబ్బంది పెట్టడం జరుగుతోందన్నారు.అవసరమైతే మార్క్ఫెడ్ ఎండీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.అకాల వర్షాల వల్ల మొక్కజొన్న తడిసి నష్టం జరిగే ప్రమాదం ఉందని,చేర్యాల, నర్మెట కేంద్రాల్లో వెంటనే కొనుగోలు ప్రారంభించాలని,రైతులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.


