రైతులను ఇబ్బంది పెడితే వెంటనే సమాచారం ఇవ్వండి
అవినీతి జరిగితే ఊరుకునేది లేదు
ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు: రైతులను ఎలాంటి ఇబ్బందులకు అసౌకర్యాలకు గురిచేసిన వెంటనే సమాచారం ఇవ్వాలని అవినీతి జరిగితే ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్. మురళి నాయక్ అన్నారు. గురువారం మండలంలోని మునిగిలవేడు లో పిఎసిఎస్ ఐకెపి, నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలోఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే స్థానిక రైతులతో ముచ్చటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాలిసిన జాగ్రత్తలను సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకంగా కొనుగోలు చేయాలని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని రైతులను ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పకుండా తీసుకుంటామని ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు, తేమ శాతం కొలిచే పరికరాలు సక్రమంగా పనిచేయాలని, చెల్లింపులు సమయానికి జరిగేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం కాబట్టి రైతు సంతోషంగా ఉండడమే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు.ఈ కార్యక్రమంలో తొర్రూర్ ఏఎంసి వైస్ చైర్మన్ బట్టు నాయక్, శ్రీరామగిరి పిఎసిఎస్ చైర్మన్ గుండా వెంకన్న, తహసిల్దార్ సిహెచ్ నరేష్, ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి మహేందర్, నెల్లికుదురు పి ఎస్ సి ఎస్ పర్సన్ ఇన్చార్జ్ మనోహర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్, జిల్లా, మండల నాయకులు, యాలాద్రి, వెంకటేష్, రాజు యాదవ్, యూత్ నాయకులు, డైరెక్టర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు, ఐకెపి ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


