ఎల్సీడీసీ సర్వేలో అనుమానిత కేసుల గుర్తింపు
రెండు లెప్రసీ కేసులకు ఎండీటీ చికిత్స ప్రారంభం
కాకతీయ, మరిపెడ: ప్రజలు వైద్యుల సూచనలు పాటించి సహకరిస్తే మరిపెడ మండలాన్ని కుష్టు వ్యాధి రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పీహెచ్సీలో ఎల్సీడీసీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన 30 మంది లెప్రసీ అనుమానితులకు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ రవితో పాటు డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి పాల్గొన్నారు. పరీక్షల అనంతరం రెండు లెప్రసీ కేసులను గుర్తించి, వారికి ఎండీటీ బహుళ ఔషధ చికిత్స అందించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ కుసుమ, విద్యాసాగర్, సూపర్‌వైజర్ సత్యనారాయణాచార్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. మరిపెడలో కుష్టు వ్యాధి నివారణకు ప్రజలు సహకరించాలని వైద్యాధికారులు కోరారు.


