కాకతీయ, నెల్లికుదురు: ప్రజల కోసం పరితపించే కమ్యూనిస్టు ఆదర్శప్రాయుడు నేలకుర్తి సీతారాం రెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జి. నాగయ్య అన్నారు. మండలంలోని బంజర గ్రామానికి చెందిన నెలకుర్తి సీతారాం రెడ్డి సంతాప సభ శనివారం గుణగంటి రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జి నాగయ్య హాజరై మాట్లాడారు.
చివరి శ్వాస దాకా కూడా కమ్యూనిస్టు కార్యకర్తగానే బ్రతికాడని, విప్లవ భావాలకు ఆకర్షితుడై పేద, బడుగుబలహీన వర్గాల ప్రజల కోసం చేసిన పోరాటాలు చేశారని అన్నారు. దోపిడీ, పెట్టుబడి భూస్వామ్య విధానాలకు వ్యతిరేకమైన ఉద్యమాలు చేయడంలో సీతారాం రెడ్డి ముందు నిలిచారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడంలో కార్మికులు, కర్షకులు రైతులు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు జి. రాములు, చిన్న చంద్రన్న, సాదుల శ్రీనివాస్, కొత్తపల్లి రవి, గుణగంటి రాజన్న, శెట్టి వెంకన్న, సమ్మెట రాజమౌళి, నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు, పెరుమాండ్ల బాబు గౌడ్, నాగన్న, అనిల్, వీరన్న సాయిలు, తోట నరసయ్య, బాణాల యాకయ్య, ఉప్పలయ్య, యాకుబ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


