అభివృద్ధికై సేవకురాలిగా కృషి చేస్తా
కాంగ్రెస్ అభ్యర్థి చైతన్య
కాకతీయ, నెల్లికుదురు : గ్రామాల అభివృద్ధికి సేవకురాలిగా నిరంతరం కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి బొల్లి కొండ చైతన్య నాగరాజు అన్నారు. మండలంలోని మునిగలవేడు సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణవేణి గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం ఆదివారం నిర్వహిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు రాజు యాదవ్ ప్రచారంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాలలో పలు సీసీ రోడ్ల తో పాటు ఎన్నో అభివృద్ధి పనులు, పలు సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందు వరసలో ఉంటానని గ్రామ, సమాజాభివృద్ధికి కృషి చేస్తానని చైతన్య నాగరాజు అన్నారు. నిరంతరం ప్రజల కష్టసుఖాలలో ప్రజల వెన్నంటే ఉంటూ ప్రతిక్షణం ప్రజలతో పాలుపంచుకుంటుందన్నారు. అమూల్యమైన ఓటును స్పానర్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


