కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే చల్లా
కాకతీయ,ఆత్మకూరు : కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా ఉంటనాని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూర్ మండల కేంద్రములో బిఆర్ఎస్ నాయకులు పూజారి రాము తల్లి ఇటీవలే మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యకర్తల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కష్టసుఖాల్లో కలిసి నిలబడతామని ఆయన మృతురాలి కుటుంబానికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి,ఆత్మకూరు ఉపసర్పంచ్ భాషాబోయిన పైడి,ఆత్మకూరు గ్రామా పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్,నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి,సుధాకర్,మనోహర్,ప్రవీణ్ రెడ్డి,భాషాబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు.


