- మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల : హనుమకొండ జిల్లా దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తుత్తురు సత్యం తల్లి లచ్చమ్మ ఇటీవల మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అధైర్య పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


