కేటీఆర్‌ను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వను
: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వార్నింగ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కేటీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ తనకంటే పెద్దోడేమీ కాదని. ఆయన విదేశాల్లో చదివి ఉండవచ్చు కానీ తనకున్న అనుభవం ఆయనకు లేదని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానని, గ్రామాల్లో కూడా అడుగు పెట్టనివ్వను అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇక మరోవైపు, నేడు ఆయన బీజేపీలో చేరబోతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు దూమారం రేపాయి. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు చేత కండువా కప్పించుకోనున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ తనతో ఎవరూ రావడం లేదని, తానే ఒక్కడినే పార్టీలో చేరుతున్నాను అని స్పష్టం చేశారు.


