కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటా
పెద్దవంగరలో మాజీ మంత్రి ఎర్రబెల్లి భరోసా
బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి పరామర్శ
కాకతీయ, పెద్దవంగర : పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తాత, సీనియర్ నాయకుడు ముత్తయ్య (95) అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించారు. మృతుడి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎర్రబెల్లి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ ఎదుగుదలకు కార్యకర్తల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి తాను ఎప్పటికీ తోడుగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య శర్మ, సుదీర్ బాబు, సునీల్ రెడ్డి, సోమనర్సింహారెడ్డి, చింతల భాస్కర్, సుధాకర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.


