అక్టోబర్ 27 (కాకతీయ సినిమా): శ్రీలీల.. ప్రస్తుతం యూత్‌కు హాట్ ఫేవరెట్. కన్నడలో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌ల జాబితాలోకి చేరిపోయింది. డ్యాన్స్‌లో స్టేజ్ దుమ్ము లేపేంత టాలెంట్, కెమెరా ముందు ఫుల్ కంఫర్ట్, ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఛార్మ్.. ఇవన్నీ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు, స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిన శ్రీలీల, తన కాబోయే జీవిత భాగస్వామిపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ` నాకు కాబోయే భర్త అందంగా లేకపోయినా పర్వాలేదు… కానీ అతను నన్ను అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. నా కెరీర్‌కు మద్దతుగా నిలవాలి. నాతో సరదాగా ఉంటూ నన్ను బాగా చూసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి. అలాంటి వాడే నాకు భర్తగా కావాలి` అంటూ శ్రీలీల మనసులోని మాటలు బయటపెట్టింది.
శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగత విషయాల్లో సింప్లిసిటీ చూపించడం ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. శ్రీలీల త్వరలోనే ` మాస్ జాతర` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది. భాను భోగవరపు డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రవితేజ హీరోగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కానుంది.


