మేడారం జాతరలో నా జోక్యంలేదు
పనులన్నీ సీతక్క, పొంగులేటి చూస్తున్నారు
నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నా
కేసీఆర్‌తో భేటీలో రాజకీయాలు చర్చకు రాలేదు
త్వరలోనే దేవాలయాల అభివృద్ధి కోసం బడ్జెట్
టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్
మంత్రి సురేఖ కీలక వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మేడారం జాతర పనులన్నీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, ఆయనతో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు.
మేడారం జాతర పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటి చూస్తున్నారని, నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నానని అన్నారు. గతంలో ఇష్టా తీరుగా అడ్మినిస్ట్రేషన్ జరిగిందని, దేవాలయాల అభివృద్ధి కోసం సీఎం బడ్జెట్ కేటాయించబోతున్నారని అన్నారు. దూప దీప నైవేద్యంపై సోషల్ ఆడిట్ జరుగుతుందని, త్వరలోనే చాలా మందిపై వేటు పడే అవకాశం ఉందన్నారు. దేవాదాయ, ఫారెస్ట్ శాఖలో స్టాప్ కొరత వెంటాడుతోందని, టెంపుల్ టూరిజం అభివృద్ధి పై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. భద్రాచలం టు బాసరా వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. మొత్తం మూడు సర్క్యూట్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బాసర, భద్రాచలం, వేములవాడ ఫైల్‌లు సీఎం వద్ద పెండింగ్ ఉన్నాయన్నారు. యాదగిరి ట్రస్ట్ బోర్డు అంశం సీఎం పరిధిలో ఉందన్నారు. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సురేఖ పేర్కొన్నారు.


