హైదరాబాద్–గోవా సూపర్ హైవే!
వీకెండ్ ట్రిప్ ఇక గంటల వ్యవహారమే
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు గోవా అంటే ప్రత్యేకమైన క్రేజ్. వీకెండ్ వచ్చిందంటే చాలు బీచ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, మార్గమధ్య రోడ్ల పరిస్థితి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక భారత్‌మాల పరియోజన కింద హైదరాబాద్–పానాజీ నేషనల్ హైవే ప్రాజెక్టును వేగవంతం చేశారు. సుమారు రూ.12 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ హైవే తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానించే ప్రధాన ఎకనామిక్ కారిడార్‌గా మారనుంది.
తగ్గనున్న ప్రయాణ సమయం
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో భూసేకరణ దాదాపు పూర్తవడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి గోవా చేరుకునే సమయం గణనీయంగా తగ్గనుంది. ట్రాఫిక్ జామ్‌లు లేకుండా సాఫీగా ప్రయాణం సాగనుంది. నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ సూపర్ హైవే
రాయచూరు – బాగల్‌కోట్ – బెల్గాం మీదుగా పానాజీకి కనెక్టివిటీ, బాగల్‌కోట్ జిల్లాలో 102 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా 9 భారీ ఫ్లైఓవర్లు, టూరిజంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు పెద్ద ఊతం, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యం. ఈ సూపర్ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం ఇక అలసట కాదు… ఆనందమైన డ్రైవ్‌గా మారనుంది.


