ధురంధర్ 2 ట్రైలర్‌కు భారీ స్పందన..!
రెండు రోజుల్లోనే 312 మిలియన్ వ్యూస్
కాకతీయ, సినిమా : దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ చిత్రం ధురంధర్ 2 ట్రైలర్‌కు అద్భుత స్పందన లభించింది. జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్ విడుదల చేసిన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే అన్ని డిజిటల్ వేదికల్లో కలిపి మూడు వందల పన్నెండు మిలియన్ వ్యూస్ దాటింది. నలభై ఐదు కంటే ఎక్కువ దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి పాత్రల్లో ఆయన నటిస్తున్నారు. ఆర్ మాధవన్ అజయ్ సన్యాల్ పాత్రలో, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా విలన్ పాత్రలో, సంజయ్ దత్ ఎస్పీ చౌధరి పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో బి 62 స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.


