కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీం, ఖానాపూర్ ఎస్ఐ సిబ్బందితో కలిసి చిలకమ్మ నగర్ చిలుకలగుట్ట ప్రాంతంలో పెద్ద మొత్తం గంజాయి పట్టివేత జరిగింది. పరిశీలనలో, నలుగురు వ్యక్తులు నాలుగు గంజాయి సంచులు, నంబర్ ప్లేట్ లేని పల్సర్ బండి లో ఉంచి దింపుతున్నట్లు గుర్తించబడ్డారు.
పట్టుబడిన నేరస్తులు.. అందాల పాండు రెడ్డి , పాండు ,నాయుడు, గుళ్లారి మునిరాజ్, కొప్పు కోటయ్య, భూక్య సాయికుమార్ , సాయి, వీరు కూలీ, వ్యవసాయ పనుల ద్వారా తక్కువ డబ్బులు పొందడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం గంజాయి వ్యాపారంలో పాల్గొన్నట్లు స్వీకరించారు. రమేష్, మజ్జి కృష్ణ ప్రధానంగా గంజాయిని కొనుగోలు చేసి, కూలీల ద్వారా ఆంధ్ర బార్డర్ వరకు చేరవేసి విక్రయించేవారు.
మొత్తం 23 సంచులు, మొత్తం బరువు 763.845 కేజీ, అంచనా విలువ రూ. 3,81,92,250 (ప్రతి కేజీ రూ. 50,000) ఉంటుందని అన్నారు.పట్టుబడిన సందర్భం..నేరస్తులు చెప్పిన స్థలంలో గంజాయి ట్రాలీ లోడ్ చేసిన తరువాత, పోలీస్ గమనించినందున, అడ్డం తప్పించి అడవిలో దాచివేసారు. తరువాత డ్రగ్ కంట్రోల్ టీం వారు ఈ స్థలానికి చేరి, పంచుల సమక్షంలో 23 సంచులను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేంద్ర రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ టీం ఇన్‌స్పెక్టర్ సతీష్, ఆర్ ఐ లు శివాకేశవులు, పూర్ణచందర్, మనోజ్, నాగరాజు, ఏ ఎస్ ఐ సుబ్బిరామిరెడ్డి, కానిస్టేబుళ్లు నజీర్ అహ్మద్, రజాన్ పాషా, రబ్బానీ, అమరేశ్వర్, రాజ్ కుమార్, జావీద్, రమేష్, సృజన్, బాలాజీ, రాంచందర్‌లను పోలీస్ కమిషనర్ అభినందించారు. వీరివల్లే 763.845 కేజీలు గంజాయి పట్టుబడింది. నేరస్తులపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని తెలిపారు.


