epaper
Monday, March 2, 2026
epaper

‘బయటకు ఎలా పొక్కింది?’

‘బయటకు ఎలా పొక్కింది?’
ప్ర‌శాంతంగా అధికారి వ‌సూళ్ల‌పై ఆరా
కాకతీయ కథనంతో ఉలిక్కిపడ్డ విద్యుత్ శాఖ..!
అక్రమ వసూళ్ల వ్యవహారంపై శాఖలో కలకలం
కాంట్రాక్టర్ వర్గాల్లోనూ చ‌ర్చ‌.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా..?

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ‘పొలం బాట’ పేరుతో రైతులపై భారం మోపుతూ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ‘కాకతీయ’లో కథనం ప్రచురితమైన వెంటనే శాఖలో అంతర్గతంగా పెద్ద చర్చ మొదలైంది. రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వార్తతో “ఎవరు తీసుకున్నారు..? ఎక్కడ తీసుకున్నారు..?” అన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

రైతులనే గుచ్చి గుచ్చి ప్రశ్నలు

విశ్వసనీయ సమాచారం ప్రకారం… సదరు ఏఎల్ఎం స్థాయి ఉద్యోగి తనపై వచ్చిన ఆరోపణలతో తీవ్ర అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా ముడుపులు తీసుకుని వ్యవహారం ముగిసిందనుకున్న అతడు, కథనం వెలువడిన వెంటనే రైతులను స్వయంగా సంప్రదించి “మీరు ఎవరికి చెప్పారు..? ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారా..? ఈ విషయం బయటికి ఎలా వచ్చింది..?” అంటూ ఫోన్ కాల్స్‌, సందేశాల ద్వారా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినట్టు సమాచారం. రైతులు ఈ ఒత్తిడితో మరింత భయాందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.

కాంట్రాక్టర్ వర్గాల్లోనూ టెన్షన్

ఇదే సమయంలో ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతున్న కాంట్రాక్టర్ వర్గాల్లోనూ అశాంతి నెలకొంది. “మా పేరు ప్రస్తావించారా..? డబ్బుల వివరాలు బయటికి వెళ్లాయా..?” అన్న ఆందోళనతో కొందరు పరుగులు పెట్టినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. పై అధికారుల దృష్టికి వ్యవహారం చేరుతుందనే భయంతో సంబంధిత వర్గాలు పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కాకతీయ పత్రికలో కథనం వెలువడిన తర్వాత పలువురు ఉన్నతాధికారులు కూడా మంగపేట పరిణామాలపై ఆరా తీసినట్టు వినిపిస్తోంది. గతంలోనే అవినీతిపై కఠిన చర్యల హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాన్ని అధికారులు ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తిగా మారింది. రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా..? లేక వ్యవహారం మళ్లీ మామూలుగా మారిపోతుందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్నే వ్యక్తిగత లాభాల సాధనంగా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ పరిస్థితిని బయటకు చెప్పుకోలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఉన్నతాధికారుల నిర్ణయాలపైనే నిలిచింది. మంగపేట అక్రమ వసూళ్ల వ్యవహారం ఎటు దారితీస్తుంది..? కఠిన చర్యల దిశగా అడుగులు పడతాయా..? లేక మళ్లీ మామూలేనా..? అన్నది వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img