epaper
Monday, March 2, 2026
epaper

ఇళ్ల‌ను పేదలకు తక్షణమే ఇవ్వాలి

ఇళ్ల‌ను పేదలకు తక్షణమే ఇవ్వాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
దూపకుంట ఇళ్లను పరిశీలించిన ఎంసిపిఐ(యు) బృందం
ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

కాకతీయ, వరంగల్ సిటీ : కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఇళ్లను కేటాయించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అర్హులైన పేదలకు తామే ఇండ్లు పంచుతామని హెచ్చరించారు. ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ జిల్లా, నగర నాయకులు దూపకుంట పరిధిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి నిర్మాణ స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిరుపేదల కోసం అన్ని సౌకర్యాలతో రెండు పడకల ఇండ్ల నిర్మాణం చేపట్టినా, వాటిని పంపిణీ చేయకుండా కాలయాపన చేయడం అన్యాయమన్నారు.

ఇళ్లు ఎందుకు పంపిణీ చేయ‌రు..?

గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కొండ సురేఖ ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ దూపకుంటలో పూర్తయిన ఇండ్లను ఇప్పటికీ పేదలకు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్ నగర పరిధిలో దూపకుంటలో సుమారు 2400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, సగం మాత్రమే పూర్తై మిగతావి అసంపూర్తిగా ఉండి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని విమర్శించారు. అలాగే లక్ష్మీ టౌన్షిప్‌లో 210, తిమ్మాపూర్‌లో 456 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే పూర్తయిన ఇండ్లను పేదలకు కేటాయించాలని, అసంపూర్తి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకం నిర్మాణాలు, నిలిచిపోయిన పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

ఈనెల 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలనే డిమాండ్‌తో ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని ఎంసిపిఐ(యు) నగర కార్యదర్శి మాలోత్ సాగర్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముక్కెర రామస్వామి, నగర నాయకులు ఎగ్గని మల్లికార్జున్, మాలోత్ ప్రత్యూష, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, మహమ్మద్ మెహబూబ్ పాషా, పరిమళ గోవర్ధన్, రాజు, తాటికాయల రత్నం, చుక్క ప్రశాంత్, నలివెల రవి, రామస్వామి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img