ఆశాల సమస్యలు పరిష్కరించాలి
కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలో ఆశల సమస్యలు పరిష్కరించాలని స్కావెంజర్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇస్సాంపల్లి సైదులు ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షులు మహేశ్వరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆశాలు చాలా సంవత్సరాలుగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నారని వారికి ఇన్సూరెన్స్ కల్పించాలని ఆశా కార్యకర్తలు మరణించితే ఖర్చుల కింద 50000 చెల్లించాలని జీవిత బీమా 50 లక్షలు కేటాయించాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్క్వేంజర్ల సమస్యలను కూడా ప్రభుత్వం గుర్తించే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల జిల్లా అద్యక్షురాలు మహేశ్వరి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


