రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు సన్మానం
కాకతీయ, నల్లబెల్లి: మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు హారిక, మహాలక్ష్మి, అక్షిత రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక కావడంతో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, నాయకులు బట్టు సాంబయ్య, కోర్నేలు విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందించారు. విద్య, క్రీడల్లో రాణించి పాఠశాల పేరును నిలబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో పెద్ద ఐలయ్య, దిండు భరత్, మనుగొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


