కాకతీయ, బిజినెస్ డెస్క్: Honor అభిమానులకు గుడ్ న్యూస్. Honor Magic 8, Honor Magic 8 Pro స్మార్ట్‌ఫోన్లను అక్టోబర్ 15, 2025న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లు అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. కాబట్టి గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా డైలీ యూజ్ ఏదైనా స్మూత్‌గా, ఎలాంటి లాగ్ లేకుండా పనిచేస్తుంది.
Honor Magic 8లో 6.58 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సినిమాలు, వీడియోలు చూడటం ఒక అద్భుత అనుభవంగా ఉంటుంది. ఇది బ్లాక్, వైట్, లైట్ బ్లూ, గోల్డ్ వంటి రంగుల్లో లభిస్తుంది. Honor Magic 8 Proలో 6.7 అంగుళాల మైక్రో కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, IP68 రేటింగ్‌తో నీరు, దుమ్ము భయం లేకుండా ఉపయోగించవచ్చు.
కెమెరా విషయంలో, Honor Magic 8లో 50MP + 50MP + 200MP త్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోటో, వీడియో, జూమ్ ఫీచర్లు అన్ని అద్భుతంగా ఉంటాయి. Honor Magic 8 Proలో కూడా ఇదే సెటప్ ఉండగా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ దూరం నుంచి కూడా స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది, ఫోటోగ్రఫీకి మరింత ప్రాధాన్యం ఇస్తుంది.
బ్యాటరీ పరంగా, Honor Magic 8లో 7000mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో, కొన్ని నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ అవుతుంది. Honor Magic 8 Proలో 7200mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీన్ని పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తుంది.
లీక్స్ ప్రకారం, Honor Magic 8 ధర సుమారు రూ. 55,990 (12GB RAM + 256GB) ఉండవచ్చు. Honor Magic 8 Pro ధర రూ. 69,999 వరకు ఉండే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్లు 2026 జనవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 200MP కెమెరా, 7200mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో Honor Magic 8 సిరీస్ వచ్చే ఏడాదిలో టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ అనుభవం కోరుకునేవారికి ఈ ఫోన్ మిస్ అవ్వరాదు.


