కాకతీయ, క్రైమ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కాడు. అతని నుంచి రూ. 7.11 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. నగరంలోని అమీర్ పేట్ కు చెందిన 81 ఏళ్ల వ్రుద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆయనతో చనువుగా మాట్లాడుతూ..సొమ్మును కాజేశారు. ఇంకా డబ్బులు అడగడంతో అనుమానం వచ్చిన ఆ వృద్ధుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
81 ఏళ్ల వృద్ధుడికి హనీట్రాప్..7లక్షలు కాజేసిన కేటుగాళ్లు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


