గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ
బొక్కలతండాలో రంగుల పండుగ ఘనంగా
కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని బొక్కలతండా గ్రామంలో బుధవారం హోలీ పండుగను గిరిజనులు ఉత్సాహంగా జరుపుకున్నారు. సంప్రదాయ ఆచారాలు, గిరిజన నృత్యాల మధ్య తండావాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందం పంచుకున్నారు. తండా నాయక్ వాంకుడోత్ రాములు నాయక్, కార్భరీ హాట్కార్ లక్మనాయక్, సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు పండుగను ఘనంగా నిర్వహించారు. గిరిజన గీతాలు, నృత్యాలతో తండా అంతా పండుగ కోలాహలంతో మార్మోగింది. మాలోత్ బావుసింగ్ నాయక్, అనంతరములు నాయక్, రాంబాబు నాయక్, రామారావు, మాంజ్య, సుమంత్ తో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోదరభావంతో జరుపుకున్న ఈ వేడుకలు తండాలో ఐక్యతను ప్రతిబింబించాయి.


