పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు
కాకతీయ, కరీంనగర్ : హోలీ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొన్నం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతాల మల్లేశం, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్నారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, నాయకులు ఆకుల నరసయ్య, పడాల అజయ్ గౌడ్, వంగల విద్యాసాగర్, యాగండ్ల అనిల్ కుమార్, ఆనంద్, ఎండి సలీముద్దీన్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, గడ్డం శ్రీరాములు, మునిగంటి అనిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల జీవితాలు రంగుల మయం కావాలని ఆకాంక్షించారు.


