అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు
కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను పురస్కరించుకొని నేరేడ్‌మెట్ ఓల్డ్ పీఎస్ పరిధిలోని అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆవరణలో రంగుల సంబరాలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సెంటర్ నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది కలిసి పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు గిరి గడ్డమీది మాట్లాడుతూ.. హోలీ పండుగ ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వర్ణ, మత భేదాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి పండుగలను జరుపుకోవడం ద్వారా సమాజంలో స్నేహభావం, పరస్పర గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి పండుగ మనలో ఆనందాన్ని నింపడంతో పాటు మనుషుల మధ్య బంధాలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు శివ గడ్డమీది, అశ్విన్ కృష్ణ మనోహర్ గడ్డమీది, ఆశిష్ విద్యార్థి గడ్డమీది, చైతన్య, అనిల్‌తోపాటు డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది బాను, రీచా, వైద్యులు డాక్టర్ చెంగలి రేఖ, డాక్టర్ రోహన్ వర్మ, డాక్టర్ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.


