- సొంత అవసరాలకు అటెండర్ జీతభత్యాలు
- తప్పుడు లెక్కలు, తప్పుడు రసీదులతో నిధులు స్వాహా
కాకతీయ, ఆదిలాబాద్: జిల్లాలోని పొన్న గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిన్న సూర్య ప్రకాష్ విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించాడు. తప్పుడు లెక్కలు రాసి, తప్పుడు రసీదులను చూపిస్తూ బిల్లులను తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు. ‘తనకు జీతం ప్రతి నెలా ఎనిమిది వేల రూపాయలు కాగా ప్రభుత్వం నుండి డబ్బులు రావడం లేదని చెప్పి ఎంతో కొంత చేతికి ఇచ్చి మిగతా డబ్బును తనే వాడుకున్నాడని’ అటెండర్ చౌహన్.మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయగా తప్పు చేశానని ప్రధానోపాధ్యాయుడు ఒప్పుకొని రూ.63 వేల చెక్కును మనోహర్ కు ఇచ్చాడని గ్రామస్తులు తెలిపారు. ఈ పాఠశాల నుండి హెచ్ఎం సూర్య ప్రకాష్ ను తొలగించి వేరే వారిని నియమించాలని, అలాగే నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓను స్థానికులు కోరారు.


