కాకతీయ, నేషనల్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చంబా జిల్లాలో జరుగుతున్న రామ్ లీల ప్రదర్శనలో సీనియర్ ఆర్టిస్ట్ అమ్రిష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. దశరథుడి పాత్ర పోషిస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు.
మంగళవారం రాత్రి జరిగిన లైవ్ ప్రదర్శనలో ఈ దుర్ఘటన జరిగింది. తన డైలాగులు చెబుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఛాతీనొప్పి మొదలై, మాటలు ఆగిపోయాయి. కొద్దిసేపటికి నేల కూలిపోయారు. అక్కడే ఉన్న ఇతర నటులు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. నిర్వాహకులు వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమ్రిష్ కుమార్‌కు స్థానికంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గత అయిదు దశాబ్దాలుగా రామలీల స్టేజ్ నాటకాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ముఖ్యంగా దశరథుడు, రావణుడు వంటి కీలక పాత్రల్లో ఆయన నటన ఎంతో ప్రసిద్ధి పొందింది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది.
A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk
— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025
ఆయన మృతితో రామలీల క్లబ్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్లబ్ సీనియర్ సభ్యుడు సుదేశ్ మహాజన్ మాట్లాడుతూ.. “అమ్రిష్ కుమార్ మృతి తీరని లోటు” అని పేర్కొన్నారు. సంతాప సూచకంగా రాబోయే కొన్ని రోజుల పాటు రామలీల ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు క్లబ్ ప్రకటించింది.


