కాకతీయ, నర్సంపేట: నర్సంపేట మండలం గురజాల గ్రామంలో గురువారం డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేసే ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులు వివిధ పంటలకు నానో యూరియా వాడకం వల్ల పంటలకు కావలసిన నత్రజని అందడంతో పాటు రైతులకు ఖర్చు, శ్రమ తగ్గుతుందని అన్నారు.
రైతులు నానో యూరియా వినియోగించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. యూరియా కంటే నానో యూరియా మెరుగ్గా పనిచేస్తుందని, కాబట్టి అధికారులు కూడా రైతులకు నానో యూరియా పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు.
నానో యూరియాను డ్రోన్ల ద్వారా పిచికారి చేయొచ్చు కావున తక్కువ సమయం తక్కువ నీటితో, సమయం వృధా కాకుండా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


