అమెరికాతో హై-ఎండ్ డీల్.. భారత్‌కు జావెలిన్ మిస్సైల్ సపోర్ట్!
భారత్–అమెరికా స్ట్రాటజిక్ బంధానికి బూస్ట్
జావెలిన్ మిస్సైల్ ప్యాకేజ్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్
4.7 మిలియన్ డాలర్ల భారీ డీల్ సెట్
కాకతీయ, నేషనల్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా మరియు భారత్ మధ్య రక్షణ రంగంలో బలోపేతమవుతున్న సంబంధాలు మరొక కీలక అడుగు ముందుకు వేసాయి. జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు అనుబంధ పరికరాల విక్రయానికి అమెరికా సర్కారు అధికారికంగా ఆమోదం తెలిపింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) విడుదల చేసిన తాజా ప్రకటన ఈ ఒప్పందాన్ని ధృవీకరించింది. ఈ డీల్ ద్వారా రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ భాగస్వామ్యం మరింతగా దృఢపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ రక్షణ ఒప్పందం విలువ మొత్తం 4.7 మిలియన్ డాలర్లు. జావెలిన్ మిస్సైల్ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన యాంటీ–ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌గా పేరొందింది. భారత సైన్యానికి ఇది మిలిటరీ స్ట్రెంగ్త్‌లో కీలకమైన అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. ఈ మిస్సైల్ సిస్టమ్ యుద్ధభూమిలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా లక్ష్యాన్ని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
ఈ హై-ఎండ్ డీల్ ప్రకారం భారత్‌కు 100 FGM-148 జావెలిన్ రౌండ్స్ అందించబడనున్నాయి. అదనంగా, ఒక ‘FGM-148 మిస్సైల్ ఫ్లై-టు-బై’, 25 లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ (LWCLU) మరియు జావెలిన్ బ్లాక్–1 కమాండ్ లాంచ్ యూనిట్స్ (CLU) కూడా అందించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇవన్నీ భారత భూసేన రక్షణ సామర్థ్యాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లగల కీలక పరికరాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాధమిక మిస్సైల్ యూనిట్స్‌తో పాటు నాన్-మేజర్ పరికరాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. వీటిలో స్కిల్స్ ట్రైనర్స్, మిస్సైల్ స్టిమ్యులేషన్ రౌండ్స్, బ్యాటరీ–కూలంట్ యూనిట్స్, ఆపరేటర్ మాన్యువల్స్, టెక్నికల్ మాన్యువల్స్, స్పేర్ పార్ట్స్, టూల్ కిట్స్ వంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఫిజికల్ సెక్యూరిటీ ఇన్సెక్షన్, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి సేవలను కూడా అమెరికా అందించనుంది. జావెలిన్ బ్లాక్–1 CLU రీఫర్బిష్‌మెంట్ సర్వీసులు కూడా ఇందులో భాగం.
టెక్నికల్ సహాయం విషయంలో కూడా అమెరికా పూర్తి సపోర్ట్ ఇవ్వనుంది. SAMD, TAGM వంటి అమెరికా డిఫెన్స్ టెక్నికల్ యూనిట్లు భారత సైన్యానికి శిక్షణ మరియు సాంకేతిక మార్గదర్శకత్వం అందించనున్నాయి. ఇది మిస్సైల్ సిస్టమ్‌ను సైనిక పరిస్థితుల్లో సమర్థవంతంగా వినియోగించేందుకు ఎంతో సహాయపడుతుంది. కాగా, ఈ కొనుగోలు భారత భద్రతను గణనీయంగా పెంచుతుందని DSCA విశ్లేషించింది. ప్రస్తుత జియోపాలిటికల్ పరిస్థితుల్లో భారత్ ఎదుర్కొనే ప్రమాదాలకు త్వరితగతిన ప్రతిస్పందించేందుకు ఈ మిస్సైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషించనుంది అనడంలో సందేహం లేదు.


