epaper
Friday, November 21, 2025
epaper

హైకోర్టు తీర్పు.. సొసైటీ చైర్మన్ గా రామస్వామి నాయక్ ప్రమాణస్వీకారం..

హైకోర్టు తీర్పు.. సొసైటీ చైర్మన్ గా రామస్వామి నాయక్ ప్రమాణస్వీకారం..

సొసైటీ చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రామస్వామి నాయక్ & పాలకవర్గం
హైకోర్టు తీర్పుతో పూర్తిస్థాయి పాలకవర్గం నియామకం
ధర్మాసనం తీర్పు అధికార పార్టీకి చెంపపెట్టు లాంటిది
సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్

కాకతీయ, ఖానాపురం : ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నర్సంపేట నియోజకవర్గం లో ఐదుగురు సొసైటీ చైర్మన్ లతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేయించడంపై హైకోర్టు ధర్మాసనం తీర్పు అధికార పక్షానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని సొసైటీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ అన్నారు. హైకోర్టు తీర్పు ఆదేశానుసారం వరంగల్ డి సి ఓ ఉత్తర్వుల మేరకు శుక్రవారం సొసైటీ ఆవరణలో ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం చైర్మన్ గా గుగులోతు రామస్వామి నాయక్, వైస్ చైర్మన్ గా దేవినేని కృష్ణ పాలకవర్గ సభ్యులతో సొసైటీ సీఈఓ ఎల్లబోయిన ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో చైర్మన్ రామస్వామి నాయక్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో కక్షపూరిత తత్వానికి హైకోర్టు తీర్పు ద్వారా ఖానాపురం సొసైటీ చరిత్రలో ఒకే పాలకవర్గం మూడుసార్లు తిరిగి అధికారం దక్కించుకోవడం అధికార పక్ష అహంకారానికి కళ్లెం వేసిందని దీన్ని ప్రజలందరూ స్వాగతించారని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం, రైతుకు లాభం చేకూర్చే సొసైటీలకు కొనుగోలు కేంద్రాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధమ స్థానంలో ఉన్న సొసైటీని వీరి వికృత చేష్టల వల్ల కనీసం మండలంలోని రైతులకు యూరియా అందించాలని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల వాన కాలంలో యూరియా దొరకగా పంటలు ఎండిపోతే.. నేడు యాసంగి సీజన్ గాను ఇప్పుడే యూరియా కొరత ఏర్పడుతుందని జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్యాకారంగా పిలవబడే ఖానాపురం మండలానికి అధిక యూరియా నిల్వలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ సొసైటీ వేములపల్లి సునీత, నీలం సాంబయ్య, ఆబోతు అశోక్, భూషబోయిన రాజు, సొంటి లక్ష్మణ్, బత్తిని భాగ్యలక్ష్మి, మేకల కుమారస్వామి, బుద్దే తిరుపతి, అన్నమనేని రవీందర్రావు, జాడి అచ్యుతం, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామసహాయం ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు వేజెల్ల కిషన్ రావు, బోడ పూలు నాయక్, వల్లెపు శ్రీనివాస్, రెడ్డి నాగార్జున రెడ్డి, మౌలానా, తిరుపతిరెడ్డి, బంధారపు శ్రీనివాస్, వడ్డె రాజశేఖర్, మచ్చిక అశోక్, నేలమర్రి నాగరాజు, మునిందర్, సొసైటీ సిబ్బంది మెరుగు రాజు, కడుదూరీ వినయ్, కొమురయ్య, అశోక్, భీమయ్య, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాకతీయ,...

ఉద్యమ కారుల గోడు అసెంబ్లీ లో వినిపించండి

ఉద్యమ కారుల గోడు అసెంబ్లీ లో వినిపించండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహబూబాబాద్...

హామీలు అమ‌లుచేయండి

హామీలు అమ‌లుచేయండి ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించాలి ఎమ్మెల్యే య‌శ‌స్వినికి వినతిపత్రం కాకతీయ, పాలకుర్తి :...

పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి

పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలిఎస్సై గోవర్ధన్ కాకతీయ, నల్ల బెల్లి: మండలంలో ఉద్రిక్తంగా...

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్...

గుట్ట శిఖం ఆక్రమణ

గుట్ట శిఖం ఆక్రమణ కాకతీయ,నర్సింహులపేట: గుట్ట శిఖమును ఆక్రమణకు గురిచేస్తున్నాడంటూ మండల కేంద్రానికి...

వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి..

వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి.. కాకతీయ,వర్థన్నపేట : ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు...

మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్

మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్ కాకతీయ, దుగ్గొండి: మండల వ్యవసాయ అధికారిగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img