నెక్కొండ మున్సిపాలిటీ కి హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్
కాకతీయ, నర్సంపేట : తెలంగాణ రాష్ట్రంలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటు హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితిని మున్సిపాలిటీగా మార్చాలని నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయితీ లను కలిపి మున్సిపాలిటీగా చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే నెక్కొండకు మున్సిపాలిటీ గా అవకాశం కల్పించాలని హై కోర్ట్ 4త్ సెషన్స్ కోర్టు ప్రభుత్వానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్‌కు ముందే నెక్కొండ మేజర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా గుర్తించాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం.



