కొండలమ్మ దేవాలయంలో గుప్త నిధుల వేటగాళ్లు.
పట్టుకున్న గ్రామస్తులు
కేసు నమోదు చేసిన ఎస్ఐ సాయికుమార్.
కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : మహబూబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం పంచాయతీ పరిధిలో కొండలమ్మ దేవుడి ఆలయంలో గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధులు తొవ్వేందుకు ప్రయత్నం చేస్తుండగా, అటువైపుగా వెళ్లిన కొందరు యువకులు గ్రామస్తులకు తెలుపడంతో గుప్త నిధులు తవ్వే వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు. పట్టుకున్న వారిలో బుర్ల మల్లేశం, భత్తుల జనార్ధన్, పెంకి సత్యనారాయణ,, కిన్నెర అశోక్ కుమార్, భూక్యా రవి,రఘు, కుమారస్వామి, గ్రామస్తుల పిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.



