epaper
Tuesday, January 20, 2026
epaper

భూ భారతితో ప్రజలకు నరకం

భూ భారతితో ప్రజలకు నరకం
భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌ని రేవంత్ స‌ర్కారు
ఏళ్ల త‌ర‌బ‌డిగా ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో ర‌క్త‌సంబంధాలు తెగుతున్నాయి
లక్షల మంది బాధ… ప్రభుత్వానికి ప‌ట్ట‌డం లేదు
ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌భుత్వం చెబుతుంటే 70 లక్షల దరఖాస్తులెందుకు..?
ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఘాటు వ్యాఖ్య‌లు

కాకతీయ, హైదరాబాద్ : భూ భారతితో ప్రజలకు నరకం క‌నిపిస్తోంద‌ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ధ‌ర‌ణిని విమ‌ర్శించి కొత్త చ‌ట్టం తీసుకువ‌చ్చిన రేవంత్ స‌ర్కారు అమ‌లులో విఫ‌ల‌మ‌వుతోంద‌ని అన్నారు. భూ సమస్యలకు అసలు కారకులు ప్రభుత్వాన్ని నడిపే వారేనని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన‘భూభారతిపై రౌండ్ టేబుల్ సమావేశం’లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూమి ఉండడాన్ని సమాజంలో స్టేటస్‌గా భావిస్తామని, అదే భూమి కోసం రక్తసంబంధాలు కూడా ప్రాణాలు తీసుకున్న సందర్భాలు తాను చూశానని తెలిపారు. కానీ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఇది కొందరిది కాదు… లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్య అని స్పష్టం చేశారు.

70 లక్షల దరఖాస్తులెందుకు..?
భూసమస్యలు పరిష్కారమయ్యాయని కొందరు చెబుతున్నారని, అయితే అలాంటప్పుడు 70 లక్షల మంది ఎందుకు దరఖాస్తులు పెట్టుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు “పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టయింది” అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో రోజూ ఇదే సమస్య తన దగ్గరకు వస్తోందన్నారు. 1984లో 150 గజాల స్థలం కొనుగోలు చేస్తే, 20 ఏళ్ల తర్వాత బ్రోకర్లు వచ్చి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని మూడు వేల మందిని ఇబ్బంది పెడుతున్న ఉదంతాలను ప్రస్తావించారు. “ఎవరు గెలిచినా ప్రభుత్వంలో మా వాళ్లే ఉంటారు… మాకేం చేయలేరు” అని అక్రమార్కులు ధైర్యంగా చెప్పుకుంటున్నారంటే చట్టాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.

చట్టాలు ఎవ‌రి చేతుల్లో ఉన్నాయి..?

చట్టాలు ఉంటాయని, కానీ ఆ చట్టం ఎవరి చేతుల్లో ఉందన్నదే అసలు సమస్య అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. లేకపోతే చట్టమే చట్టుబండలుగా మారుతుందన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. దళితులకు ఎప్పుడో కేటాయించిన భూములను ఇప్పుడు గుంజుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే, భూమికోసం ఎన్నో ఏళ్లు పోరాడిన తెలంగాణలో ఎందుకు హక్కులు కల్పించడం లేదని ప్రశ్నించారు. దళితుల భూములకు విలువ పెరిగిందనే కారణంతో వాటిని లాక్కుంటున్నారని ఆరోపించారు. గజ్వేల్‌లో వేల ఎకరాల భూములు గుంజుకున్న ఘటనలను గుర్తు చేశారు. తెలంగాణలో భూమి కొనుక్కున్న వాడికి సుఖం లేదని వ్యాఖ్యానించారు. ఎల్‌బీనగర్‌లో ఎన్నేళ్ల కింద కొనుగోలు చేసిన భూములను 118 జీవోతో హక్కులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దుర్మార్గాలకు ప్రభుత్వాలే కారణమని, పోరాటం చేయాల్సింది పాలకులపైనేనని స్పష్టం చేశారు. చట్టాన్ని దేవుడు చేయడని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే చేస్తుందని, ప్రభుత్వం సమస్యలను జటిలం చేయకుండా పరిష్కరించాలని హితవు పలికారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పేదలంటే, ప్రజలంటే భయం లేదని మండిపడ్డారు. ఈ సభ ద్వారా భూసమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఎలా కూలిందో, ఈ ప్రభుత్వం కూడా అలాగే కూలక తప్పదని ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ‌ల‌వంతంగా చలాన్లు వ‌సూలు చేయొద్దు

బ‌ల‌వంతంగా చలాన్లు వ‌సూలు చేయొద్దు కాక‌తీయ‌, హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల...

రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం

రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ జస్టిస్ ఫర్...

గగనతలంలో రంగుల పండుగ

గగనతలంలో రంగుల పండుగ గోల్కొండ కోట‌లో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్...

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..?

మీ పార్టీలో మహిళలకు టికెట్లు ఎక్కడ..? నిర్ణయాధికారాలు ఎవరివి..? ముస్లిం మహిళలు మీ...

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు!

సికింద్రాబాద్‌పై కత్తి పెట్టొద్దు! డీలిమిటేషన్ పేరుతో కుట్ర కార్పొరేషన్‌తో పాటు జిల్లా ఏర్పాటు చేయాలి హైద‌రాబాద్‌ను...

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’...

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు!

జాగృతిలో అధ్యయన కమిటీ ఏర్పాటు! ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి కమిటీ సభ్యుడిగా...

ఆహార కల్తీపై ఉక్కుపాదం!

ఆహార కల్తీపై ఉక్కుపాదం! ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తాం ప్రత్యేక బృందాలు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img