కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాల వల్ల మహాముత్తారం మండలం ములుగుపల్లి-అంశపూర్ గ్రామాల మధ్య వాగు ఉద్ధ్రుతి పెరిగింది.
ద్విచక్ర వాహనంపై దాటేందుకు ప్రయత్నించిన రాజు అనే యువకుడు బైకుతోపాటు కొట్టుకుపోయాడు. ఈత రావడంతో ఆ యువకుడు బతికి బయటపడ్డాడు. వరదల నేపథ్యంలో ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


