కాకతీయ, వరంగల్: వరంగల్ భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉదయం వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చింది. ఆ మార్గంలో వెళ్లిన రెండు బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో గట్టిగా కేకలు పెట్టారు.
స్థానికులకు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లోఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన తర్వాత ఆ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. మరో మార్గంలో వాహనాలను మళ్లించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



