కాకతీయ, బయ్యారం: మండలంలో బుధవారం మధ్యాహ్నం 2.06 సమయం నుండి భారీ వర్షం కురిపిస్తుంది.రోడ్లన్ని జలమయంగా మారాయి. రైతులు పొలాల్లో నాట్ల పనులలో నిమగ్నం కావడంతో , వారి పనులకు వర్షం ఆటంకంగా మారింది. బుధవారం, గురువారం జిల్లాలో హెవీ రెయిన్ వస్తుందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం తో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ కోవిద్ రాంనాంధ్ కేకన్, క్షేత్ర స్థాయిలో ,అధికారులు అప్రమత్తం చేశారు.ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలకు, జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు . వర్షం తో ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ,అధికారులు జిల్లా కేంద్రంలో , టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి,అప్రమత్తం గా ఉన్నట్లు తెలిసింది.


