కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలే కాకుండా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా ఇన్ ఫ్లూ వచ్చి చేరుకుంటుంది. దీంతో నాగార్జున సాగర్ 20 గేట్లు, పులిచింతల ప్రాజెక్టు 6గేట్లనుఎత్తినీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
22 క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,71,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 1,98,152 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 2,13,660 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు ఉండగా..ప్రస్తుత నీటి మట్టం 587.30అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు ఉండగా..ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 305.6838 టీఎంసీలుగా ఉంది.
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నేడు సెలవు దినం కావడం తో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.
పర్యాటకుల తాకిడి నేపద్యంలో జెన్ కో కార్యాలయం నుంచి డ్యాం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాగార్జున కొండ కు వెళ్ళే బోటింగ్ కేంద్రాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.


