- వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద పల్స్ పోలియో చుక్కలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాలు , పట్టణాలలో ప్రత్యేక పల్స్ పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆపోహ లకు, ఆస్కారం లేకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యవంతమైన పిల్లలే రేపటి దేశానికి సంపదని పిల్లల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లాలో పల్స్ పోలియో 97శాతం పూర్తి అయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, స్టేట్ అబ్జర్వేర్స్ డాక్టర్ ప్రసాద్, అశోక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయకుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ దిలీప్, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


