కాకతీయ, నేషనల్ డెస్క్: విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రధానోపాధ్యాయురాలు తన విధులను మరిచి ప్రవర్తించారు. నీతి బోధనలతో విద్యార్థుల జీవితాలను తీర్చదిద్దాల్సింది పోయి..వారితో కాళ్లు పట్టించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి చోటుచేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ తరగతి గదిలో ప్రధానోపాధ్యాయురాలు కలైవాణి ఓ టేబుల్ పై పడుకుని ఉంది. ఇరువైపులా ఆమె కాళ్ల దగ్గర ఉన్న విద్యార్ధులు ఆమె కాళ్లు పడుతున్న ద్రుశ్యాలు కనిపించాయి. దీంతో ప్రధానోపాధ్యాయురాలి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి టీచర్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని సదరు ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.


