కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హరీశ్ రావు తరపున న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలంటూ కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ కోర్టుకు తెలిపారు.
అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు అన్నారు. అసెంబ్లీలో తీర్మానించకుండానే సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. దీనిపై పదే పదే హరీశ్ రావు తరపు న్యాయవాది అభ్యర్థించినా కోర్టు అంగీకరించలేదు.
కాళేశ్వరం రిపోర్టుపై ప్రభుత్వం నిర్ణయం తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే ధర్మాసనం కోరింది. రేపు లేదా ఎల్లుండి చెబతామని ఆయన బదులు ఇచ్చారు. రేపటి వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. తర్వాత విచారణను రేపటికి వాయిదా వేసింది.


