- అమెరికాలో దుండగుల కాల్పుల్లో చనిపోవడం బాధాకరం
- వీలైనంత త్వరగా పార్థివదేహం స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన డెంటల్ విద్యార్థి చంద్రశేఖర్ పోలే కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఎల్బీనగర్‌కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ పోలే బీడీఎస్ పూర్తిచేసి పై చదువుల కోసం అమెరికాలోని డల్లాస్ వెళ్లారు. శనివారం తెల్లవారుజామున దుండగులు జరిపిన కాల్పుల్లో దుర్మరణం పాలవడం అత్యంత విషాధకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న అవేదన చూస్తే గుండె తరుక్కు పోతున్నది అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చంద్రశేఖర్ పార్థీవదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.


