కాకతీయ, పరకాల : రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ, ఇటీవలే మృతిచెందగా హైదరాబాద్ లోని వారి స్వగృహంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.


