హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి
కాకతీయ, కరీంనగర్ : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆదేశాల మేరకు, కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ కరీంనగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్టోస్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెఫ్రీ ఎప్టోస్టీన్ ఫైళ్లలో ప్రస్తావనలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. చిన్నారులపై జరిగిన లైంగిక, శారీరక, మానసిక వేధింపులకు న్యాయం చేయాలని మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులపై అరెస్టులు చేసి వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు మమత, దివ్య, వెంకటలక్ష్మి, మనశ్విని, రేష్మ, వసంత తదితరులు పాల్గొన్నారు.


