- నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని ఒక యువకుడు ప్రేమ పేరుతో వేధించడంతో వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన భూంపల్లి అఖిల అనే యువతిని అదే గ్రామానికి చెందిన బండోల్ల నరేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు తెలుపగా నిందితున్ని మందలించారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆమె జోలికి వెళ్లలేదు. కాగా మళ్లీ వేధింపులు మొదలుపెట్టి ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరించడంతో ఈనెల 2 (ఆదివారం) సాయంత్రం ఆమె పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి భూంపల్లి నీల ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


