ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్.అర్.కే పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి, గౌరవ అధ్యక్షుడు మడికంటి రాజయ్య, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, శ్రీనివాస్, మల్లయ్య, ఓదెలు పాల్గొన్నారు


