పేరం గోపికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్
సమాజ సేవకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
: వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్
కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని 54వ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న పేరం గోపికృష్ణ జన్మదిన సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్, నీరటి రాజు మిత్రులతో కలిసి గోపిని అభినందించారు. ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవకులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెరం గోపి సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారని, భవిష్యత్లో ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. గోపి వంటి సేవా భావం కలిగిన వ్యక్తులకు ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పెరం గోపి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరటి రాజు, సిరబోయిన సారంగపాణి, బాషబోయిన సందీప్, అల్లాడి రాజు, బోనాల రమేష్, చీకటి సతీష్, చల్లూరి రాజు, వివేక్, రాము, రాజకుమార్, వెంకన్న, రమణ, కంచర్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


