వైభవంగా హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు
కాకతీయ, కరీంనగర్ / భగత్ నగర్ : స్థానిక భగనగర్‌లోని అంజనాద్రి క్షేత్రంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి వివిధ సుగంధ ద్రవ్యాలు,పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు.ఈ సందర్భంగా భక్తులకు శ్రీసీతారాముల తలంబ్రాలు,ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కిచెన్,షెడ్‌ను ప్రారంభించి, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మెండయ్య, కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



